దారుణ పతనం... పన్నెండు శాతం క్షీణించిన వొడాఫోన్ షేర్లు

ABN , First Publish Date - 2021-08-04T01:50:36+05:30 IST

టెలికం సర్వీసెస్ కంపెనీ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) ఇప్పటికిప్పుడైతే కోలుకుంటుందన్న పరిస్థితి కనిపించడంలేదు.

దారుణ పతనం... పన్నెండు శాతం క్షీణించిన వొడాఫోన్ షేర్లు

ముంబై : టెలికం సర్వీసెస్ కంపెనీ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) ఇప్పటికిప్పుడైతే  కోలుకుంటుందన్న పరిస్థితి కనిపించడంలేదు. అదే సమయంలో కంపెనీ షేర్లు ఎంత దారుణంగా పతనమవుతాయన్నది కూడా ఊహకందడంలేదు. మొత్తానికి మంగళవారం బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడ్‌పై కంపెనీ షేర్లు 12 శాతం క్షీణించి 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. ఇవి గతేడాది జూలై నుంచే అత్యల్ప స్థాయిలో ట్రేడవుతోన్న విషయం తెలిసిందే. ఈ స్టాక్... 2019 నవంబరులో రికార్డ్ స్థాయిలో రూ. 2.61 కి పడిపోవడం గమనార్హం. ఏజీఆర్ బకాయిలతో కంపెనీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో


రుణభారంతో సతమవుతున్న కంపెనీ వాటాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. వొడా ఐడియాలో బిర్లాకు 27 శాతం వాటా, అలాగే బ్రిటీష్ కంపెనీ వోడాఫోన్ పిఎల్‌సీకి 44 శాతం వాటాలున్నాయి. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ మార్కెట్ విలువ రూ. 23.73 వేల కోట్లు. మరోవైపు ప్రమోటర్లకు కంపెనీ నిర్వహణ భారంగా పరిణమించింది. పైగా సంస్థలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలో పెద్ద వాటాను కలిగి ఉన్న ప్రమోటర్లు ఏమాత్రం ఆసక్తి చూపించడంలేదు. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలు రూ. 58,254 కోట్లు కాగా, వీటిలో రూ. 7,854 కోట్ల మేరకు చెల్లింపులు జరిగాయి, ఇక మిగిలిన రూ. 50,399 కోట్ల మేరకు బకాయిలను చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఏజీఆర్ గణాంకాల దిద్దుబాటును కోరుతూ సుప్రీం కోర్టులో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే... సంస్థల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మరోవైపు గతేడాది సెప్టెంబరులో రూ. 25 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు వొడాఫోన్ ఐడియా బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ. అప్పటికే సంస్థకు భారీగా అప్పు ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువైనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-08-04T01:50:36+05:30 IST