Abn logo
Sep 25 2021 @ 23:23PM

బడికి పంతులు డుమ్మా!

సిరికొండ మండలం బోరింగ్‌గూడలో పాఠాలు చెబుతున్న అంగన్‌వాడీ టీచర్‌

విధులకు ఎగనామం పెడుతున్న పలువురు ఉపాధ్యాయులు
అమలుకు నోచుకోని బయోమెట్రిక్‌ విధానం
ఏజెన్సీ గ్రామాల్లో మరీ అధ్వానంగా పరిస్థితులు
ప్రత్యక్ష తరగతులపై కొరవడుతున్న పర్యవేక్షణ
ఉపాధ్యాయులు లేక ఆగమవుతున్న సర్కారు చదువులు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు21 (ఆంధ్రజ్యోతి): కరోనా తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తిరిగి ప్ర భుత్వ పాఠశాలలను పున:ప్రారంభించారు. ఈ విద్యాసంవత్సరం వృథా కా కూడదనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులకు పూర్తిగా స్వస్థి పలికి ప్రత్యక్ష బోధనను ప్రారంభించింది. ఇప్పుడిప్పుడే సర్కారు బడి గాడి లో పడుతుందన్న సమయంలోనే ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్ట డంతో అసలుకే మోసమయ్యేలా కనిపిస్తుంది. పాఠశాలకు హాజరుకాని విద్యార్థులను దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే విధులకు ఎగనామం పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
జిల్లాలో మొత్తం పాఠశాలలు 834..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలలు క లిసి మొత్తం 834 ఉన్నాయి. వీటి పరిధిలో 99వేల602 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. క్రమంగా వి ద్యార్థుల హాజరుశాతం పెరుగుతున్నా ఉపాధ్యాయుల హాజరుశాతం లేకపోవడంతో ప్రయోజనం కనిపించడం లేదు. ఉపాధ్యాయుల కోసం నిత్యం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యార్థులే చెబుతున్నా రు. ప్రత్యక్ష తరగతులపై పర్యవేక్షణ లేకపోవడంతో అ రకొరగానే ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు కొంత మెరుగ్గానే కనిపిస్తున్నా ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో మాత్రం పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి.
బయోమెట్రిక్‌ లేదనే దీమా..
గతంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేశారు. దీంతో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగ్గానే కనిపించింది. కా నీ, ప్రస్థుతం ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని ఎత్తి వేయడంతో కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్న ట్లు తెలుస్తుంది. కరోనా ప్రభావం తర్వాత ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించిన బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయకపోవడంతో ఉపా ధ్యాయుల విధులపై నిఘా లేకుండానే పోయింది. దీనినే ఆసరాగా తీసు కుంటున్న కొందరు ఉపాధ్యాయులు యాథేచ్ఛగా విధులకు డుమ్మా కొడు తున్నారు. ఒకవేళ వెళ్లిన మధ్యాహ్నం వరకు కాలయాపన చేస్తూ తిరుగుముఖం పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతు న్నారు. క్రమం తప్పకుండా విధులకు హాజరై విద్యార్థులకు బోధన చేస్తూ సందేహాలను నివృత్తం చేయాల్సి ఉంది. కానీ, ఉపా ధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల అను మానాలు తొలగడం లేదు. విధులకు హాజరయ్యేందుకు కొందరు ఉపాధ్యాయులు ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది.
ఐటీడీఏ అధికారులకు పట్టింపు కరువు..
జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఏకోపాధ్యాయ, ఇతర పాఠశాలల తలుపులు ఇ ప్పటికీ తెరుచుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొన్నిపాఠశాలల్లో అం దుబాటులో ఉన్న అంగన్‌వాడీ టీచర్లతో పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయులు బడికి దూరంగా ఉంటున్నారు. కొందరైతే అమాయక గిరిజన నిరుద్యోగులను మచ్చిక చేసుకొని నెలకు ఎంతో కొంత ఇస్తూ బడిని కొనసాగిస్తున్నారు. విద్యా వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో జిల్లాలో 447 ఏకోపాధ్యాయ, ఇతరపాఠశాలల పై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్నిచోట్ల ఇద్దరు ఉపాధ్యాయులు పని చేసే పాఠశాలల్లో వంతుల వారీగా విధులకు హాజరవుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా సెలవు లెటర్లు పెట్టి వెళ్తున్నారు. గ్రామాల్లో ఎక్కువ పాఠశాలలు మూసే ఉంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఏజెన్సీ గ్రామాలల్లో ఇంత జరుగుతున్న ఐటీడీఏ అధికారులకు పట్టింపే లేకుండా పోతుందన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ చేయక పోవడంతోనే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు.
విధులకు హాజరుకాకుంటే చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నాం. వీటి పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించాం. కరోనా పరిస్థితుల దృష్ట్యా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రారంభించడం లేదు. ఇ ప్పుడిప్పుడే విద్యార్థుల హాజరుశాతం పెరుగుతుంది. పరిస్థితులు మె రుగుపడితే తిరిగి బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రారంభిస్తాం.
- ప్రణీత (జిల్లా విద్యాశాఖాధికారి, ఆదిలాబాద్‌)