విశ్వనాథ్‌పేట్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్న రోడ్డు

ABN , First Publish Date - 2021-07-23T07:53:09+05:30 IST

నిర్మల్‌ నుండి ఆదిలాబాద్‌ వెళ్లే రోడ్డు మార్గంలోని విశ్వనాథ్‌పేట్‌ రహదారి నిర్మల్‌లో కురిసిన భారీ వర్షానికి ఘోరంగా దెబ్బతింది.

విశ్వనాథ్‌పేట్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్న రోడ్డు
దెబ్బతిన్న విశ్వనాథ్‌పేట్‌ రోడ్డు

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 22 : నిర్మల్‌ నుండి ఆదిలాబాద్‌ వెళ్లే రోడ్డు మార్గంలోని విశ్వనాథ్‌పేట్‌ రహదారి నిర్మల్‌లో కురిసిన భారీ వర్షానికి ఘోరంగా దెబ్బతింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రూరల్‌ సీఐ వెంకటేష్‌ బారికేడ్లు ఏర్పాటు చేయించారు. రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు రహదారిపై బారికేడ్‌ ఏర్పాటు చేశారు. రోడ్డుపై గుంతలు పడి పూర్తిగా చెడిపోయింది. మరమ్మతులు పూర్తయ్యే వరకు వాహనాలు జాగ్రత్తగా నడపాలని సీఐ కోరారు. 


Updated Date - 2021-07-23T07:53:09+05:30 IST