టోర్నీలన్నీ జూలై వరకు రద్దు: బీడబ్ల్యూఎఫ్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-07T00:50:57+05:30 IST

జూలై వరకు అన్ని టోర్నమెంట్లను వాయిదా వేస్తున్నట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) పేర్కొంది. కరోనా

టోర్నీలన్నీ జూలై వరకు రద్దు: బీడబ్ల్యూఎఫ్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: జూలై వరకు అన్ని టోర్నమెంట్లను నిలిపివేస్తున్నట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ఇంటర్నేషనల్, జూనియర్, పారా టోర్నమెంట్లు అన్నింటినీ మే నుంచి జూలైకి షెడ్యూల్ చేసినట్టు తెలిపింది. వీటిలో హెచ్ఎస్‌బీసీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్, బీడబ్ల్యూఎఫ్ టూర్‌ వంటి గ్రేడ్ 2, గ్రేడ్ 3 టోర్నీలు వంటివి ఉన్నాయి. హోస్ట్ మెంబర్స్ అసోసియేషన్స్ (హెచ్ఎంఏ), కాంటినెంటల్ కాన్ఫెడరేషన్స్ (సీసీ)లతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. తాజా నిర్ణయ ప్రభావం ప్రముఖ టోర్నమెంట్ అయిన ఇండోనేషియా ఓపెన్ 2020 (సూపర్ 1000)పై పడనుంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లు, వారి పరివారం ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు దృష్ట్యా టోర్నీలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు డబ్ల్యూబీఎఫ్ తెలిపింది.   

Updated Date - 2020-04-07T00:50:57+05:30 IST