బడుగుల ఆశాజ్యోతి పూలే

ABN , First Publish Date - 2021-11-29T05:34:26+05:30 IST

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుపూలే అని తెలుగుదేశం పా ర్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి అన్నారు.

బడుగుల ఆశాజ్యోతి పూలే
పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు


ఘనంగా వర్ధంతి

నివాళులర్పించిన టీడీపీ, 

బీసీ సంఘాల నాయకులు

గిద్దలూరు టౌన్‌, నవంబరు 28 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుపూలే అని తెలుగుదేశం పా ర్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి అన్నారు. ఆది వారం జ్యోతిరావుపూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు పూల మాలవేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్‌ మస్తాన్‌, బూనెబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌, మండ్ల శ్రీనివాసులు, బ్రహ్మచారి, చక్రియాదవ్‌, గోపాల్‌రెడ్డి  పాల్గొన్నారు. 

బీసీ నాయకుల ఆధ్వర్యంలో 

బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీ సీ నాయకులు కటారు అ రుణ్‌కుమార్‌యాదవ్‌, కౌన్సిలర్లు చంద్రశేఖర్‌యాదవ్‌, రమేష్‌, బ్రహ్మయ్య, గోపాల్‌, పోలురాజు, బా షా, చక్రియాదవ్‌, బయ్య న్న, పెద్దిరాజు పూలమాల లు వేసి నివాళులర్పించా రు. ఈసందర్భంగా బీసీ నాయకులు అరుణ్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ పూలే బాల్యవివాహాలను నిషేధించాలని ఉద్యమా లు చేశారని కొనియాడా రు.

మార్కాపురంలో..

మార్కాపురం (వన్‌ టౌన్‌) : మార్కా పురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో కరెంట్‌ ఆఫీస్‌ ఆవరణలో ఉన్న జ్యో తిరావు పూలే వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సం ఘ నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. అనంతరం ఏపీ రజక చైతన్యం రాష్ట్ర అధ్యక్షులు పోలిశెట్టి తిరుపతయ్య మాట్లాడుతు వె నుకబడిన, అట్టడుగు అణగారిన వర్గాలు అభివృద్ధి కేవ లం ఉన్నత విద్యతోనే సాధ్యమని గుర్తించిన మహ నీయులు పూలె అని అన్నారు. ఆయన ఆశయాలు కొనా సాగించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ బీసీసెల్‌ అధ్య క్షుడు టీవీ కాశయ్య, పోతనపల్లి వెంకటేశ్వర్లు, కల్లూరి శివ, బీసీ నాయకులు రంగనాయకులు పాల్గొన్నారు.

కంభంలో..

కంభం : మహాత్మ జ్యోతిరావుపూలే వర్ధంతిని స్థానిక కంభం, కందులాపురం సెంటర్‌లో విముక్తి చిరుతల కక్ష్యి నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేశేఖర్‌ అధ్యక్షతన ఘ నంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌, ప్రజా చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు దాసరిరెడ్డి, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు షాలెంరాజు, దళిత వెల్ఫేర్‌ సంఘం నాయకులు అరున్‌దీప్‌ పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వక్తలు మా ట్లాడుతూ జ్యోతిరావుపూలే 18వ శతాబ్దంలోనే దేశంలోని కుల వివక్ష, విద్య, మహిళా వివక్ష, అంటరానితనం దురాచారాలను రూ పుమాపడానికి నిరంతరం కృషి చేశారన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలంటే విద్య ఒక్కటే మార్గమని, మహిళల విద్యకు పాటుపడ్డారు.  కార్యక్రమంలో బీసీ సంఘ జిల్లా నాయకులు రాజు, డప్పు కళాకారుల నాయకులు అనిల్‌కుమార్‌, ఎలక్ర్టికల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌ పాల్గొన్నారు.

వైపాలెంలో..

ఎర్రగొండపాలెం :   అణగారిన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ మహాత్మాజ్యోతిరావ్‌పూలే  అని నియోజకవర్గ బహుజన ఐక్యవేదిక నాయకు లు ఆయన సేవలను కొనియాడా రు. మహాత్మాస్వర్గీయజ్యోతిరావ్‌ పూ లే  వర్ధంతి సందర్భంగా  ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో కోటా డేవిడ్‌,  మెడబలిమి వెంకటేశ్వరరావు, చేదూరి గంగయ్య, గజ్జా వెంకటేశ్వర్లు, తుమాటి అచ్చయ్య,  కె గురవయ్య, రాచీటి ప్రసాదరావు, షేక్‌ ఇస్మాయిల్‌, తూమాటి చెన్నకేశవులు తదితరులు పాల్గొని నివాళులు తెలిపారు. 

Updated Date - 2021-11-29T05:34:26+05:30 IST