బడుగుల ఉద్యమ సూరీడు అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2021-12-07T05:21:22+05:30 IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాబ్‌ అంబేడ్కర్‌ బడుగు బల హీలవర్గాల ఉద్యమ సూరీడు అని పలువురు దళిత, బీసీ నేతలు కొనియాడారు.

బడుగుల ఉద్యమ సూరీడు అంబేడ్కర్‌
ప్రొద్దుటూరులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మాలమహానాడు నేతలు

ప్రొద్దుటూరు అర్బన్‌/టౌన్‌/క్రైం, డిసెంబరు 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాబ్‌ అంబేడ్కర్‌ బడుగు బల హీలవర్గాల ఉద్యమ సూరీడు  అని పలువురు దళిత, బీసీ నేతలు కొనియాడారు. సోమ వారం అంబేడ్కర్‌ 65 వర్ధంతిని ప్రొద్దుటూరులో దళిత, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. బీసీ సమాఖ్య కార్యాలయంలో సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ సోమాలక్ష్మీనరసయ్య, చల్లా రాజ గోపాల్‌, సందుశివనారాయణ, జయప్రకాష్‌ సుబ్బరా మయ్యలు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మైదుకూరు రోడ్డులోని అంబే డ్కర్‌ విగ్రహానికి ఎస్సీ, ఎస్సీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కౌన్సిల్లర్‌తలారి పుల్లయ్య, తలారి రమేషన్‌ దళిత సమాఖ్య నేత ఎల్లయ్య మాదిగలు క్షీరాభిషేకం చేశారు. జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు గోస మనోహర్‌ ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతల దానమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి సాత్రి సురేష్‌, జిల్లా యువనాయకుడు వినోద్‌కుమార్‌, పట్టణ నేతలు మధు, మద్దిలేటమ్మ, జ్యోతి, సభ్యులు అంబేడ్కర్‌కు  నివాళులర్పించారు.  మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామా జి ఇమ్మానుయేల్‌, నడింపల్లెలోని ఆనంద నిలయం వసతి గృహంలో జమ్మలమడుగు డివిజన్‌ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ సభ్యుడు గాలిపోతుల సుదర్శన్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. హాస్టల్‌ వార్డెన్‌ నాగరాజు నాయక్‌, ఆశీర్వాదం, సామేల్‌ పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయశేఖర్‌  జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేష్టాది భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి సంపత్‌కుమార్‌, పట్టణాధ్యక్షుడు బాలనరసింహులు, మధు, శాంత య్య  అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సాత్రి లక్షుమయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకయ్య, యూత్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌, డివిజనల్‌ అధ్యక్షుడు చిన్న ఓబులేసు, బాల ఏసు, మహేష్‌ పాల్గొన్నారు. 

జమ్మలమడుగులో (రూరల్‌): పట్టణంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ శివమ్మ, వైసీపీ నాయకులు అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. అలాగే డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు వినయ్‌కుమార్‌, సమత దళిత్‌ యునైటెడ్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి బాబు, వైస్‌ఛైర్మన్‌-2 సింగరయ్య, నల్లప్ప, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు దాసు, అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. 

కొండాపురంలో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 65వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో  అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు నాగసుబ్బరాయుడు, శ్రీనివాసులు, శివశంకర్‌, పెద్దన్న, రమేష్‌, కరుణాకర్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

ముద్దనూరులో: మండల పరిధి కోడిగాండ్లపల్లె సమీపంలోని  మానసిక వికలాంగుల  ఆశ్రమంలో  దళిత నాయకుడు ఎం.మనోహర్‌బాబు ఆధ్వర్యంలో  అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో దళిత నాయకుడు చిన్న, మోషయ్య, రవిచంద్ర పాల్గొన్నారు.

రాజుపాళెంలో: స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్‌ సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ రాజ్యాంగం రచించిన విధానాన్ని, దేశానికి చేసిన సేవలు గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు  పాల్గొన్నారు.



Updated Date - 2021-12-07T05:21:22+05:30 IST