బద్వేలు ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-09-30T22:50:45+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ విజయరామరాజు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

బద్వేలు ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్‌

కడప: బద్వేలు ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ విజయరామరాజు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చందని విజయరామరాజు పేర్కొన్నారు.


బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేలు ఉప ఎన్నిక నగారా మోగింది. అక్టోబరు ఒకటిన నోటిఫికేషన్‌ జారీ.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 30న ఓటర్ల తీర్పు.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చింది. జగన్‌ సొంత జిల్లా కావడంతో ఈ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పక్షాలు, విశ్లేషకులు అందరు ఇటువైపు దృష్టి కేంద్రీకరించారు.

Updated Date - 2021-09-30T22:50:45+05:30 IST