Advertisement
Advertisement
Abn logo
Advertisement

బద్వేల్‌లో పోలింగ్ ప్రశాంతం: Vijayanand

అమరావతి: బద్దేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ అన్నారు. బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా  విజయానంద్ పరిశీలిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 10.49 ఓట్లు నమోదు అయినట్లుగా వెల్లడించారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చినట్లు తెలిపారు. స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఓటింగ్ ప్రక్రియను 24 మంది అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement