Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రారంభమైన బద్వేల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

కడప: బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బద్వేల్‌లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్‌ను నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కోసం నాలుగు హాళ్లు, 27 టేబుళ్లను ఏర్పాటు చేశారు.  12 రౌండ్లలో బద్వేల్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగనుంది.


బద్వేల్‌లో మొత్తం 2,15,392 ఓట్లకు గాను 1,46,562 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల ప్రకారం దాదాపు అన్ని టేబుళ్లతో పది రౌండ్లు కౌంటింగ్‌ నుంచి గరిష్ఠంగా 12 రౌండ్ల వరకు సాగే అవకాశం ఉంది. అన్ని టేబుళ్లతో ఒక్కొక్క రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత వాటిని అన్నింటిని జోడించి ఆ రెండు ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాల రౌండ్‌ కౌంటింగ్‌ ఒకదానికొకటి చేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు, వికలాంగుల పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కౌంటింగ్‌కన్నా ముందే లెక్కిస్తారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ సిబ్బంది పర్యవేక్షణలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు, జనరల్‌ ఏజెంట్లు కూడా కౌంటింగ్‌లో అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు సూచనలు ఇచ్చారు.


మరోవైపు బద్వేలు బరిలో ఎవరి బలం ఎంతో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉప ఎన్నిక ఫలితం కంటే పోటీ చేసిన ప్రధాన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు..? గెలిచే వారి మెజార్టీ ఎంత..? రెండో స్థానంలో నిలబడే పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు..? అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement