Abn logo
Sep 26 2021 @ 23:09PM

కరాటేలో బద్వేలుకు పతకాలు

పతకాలు సాధించిన విద్యార్థులతో కోచ్‌, నిర్వాహకులు

బద్వేల్‌ రూరల్‌, సెప్టెంబరు 26: కర్నూలు నగరంలోని జీహెచ్‌ఏ స్టేడియం లో ఆదివారం నిర్వహించిన ఇంటర్‌ స్టేట్‌ కరాటే పోటీల్లో ఆరుగురు బద్వేలు విద్యార్థులు బంగారు పతకాలు సాఽధించినట్లు అకాడమీ డైరెక్టర్‌ దయాకర్‌ తెలిపారు. వీరిలో అండర్‌-17 బాలికల విభాగంలో టి.వాత్సల్య, అం డర్‌-13 కటాఫ్‌లో వై.జయవర్ధన్‌, అండర్‌-11లో సాయితమన్‌ బంగారుపతకాలు సాధించారు. అండర్‌-11 కటాఫ్‌ లో ఇర్ఫాన్‌ వెండి , అండర్‌-10లో రేవంత్‌కుమార్‌, అండ ర్‌-9లో తేజ్‌వర్ధన్‌రెడ్డి కాంస్య పతకాలు సాధించారన్నారు.