బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి

ABN , First Publish Date - 2021-06-10T10:51:41+05:30 IST

ఇరాక్ దేశంలోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గురువారం తెల్లవారుజామున...

బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి

బాగ్దాద్ (ఇరాక్): ఇరాక్ దేశంలోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గురువారం తెల్లవారుజామున డ్రోన్లతో దాడి జరిగింది. మూడు వైమానిక డ్రోన్లతో విమానాశ్రయంపై దాడి చేశారని ఇరాక్ భద్రతా సంస్థలు తెలిపాయి. మూడు మానవరహిత విమానాలతో జరిగిన దాడిలో ఒకదాన్ని కూల్చివేశారని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న విక్టరీ సైనిక స్థావరం ఈ రాకెట్ కాల్పులకు గురైందని భద్రతా వర్గాలు వెల్లడించాయి.ఇటీవల సలాహ్ అడ్ దిన్ లోని బలాడ్ ఎయిర్ బేస్ పై రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇరాక్ భద్రతా అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-06-10T10:51:41+05:30 IST