Abn logo
Sep 23 2021 @ 01:14AM

26న బహుజన జగిత్యాల జైత్రయాత్ర

జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఎస్పీ నాయకులు

- బీఎస్పీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పుప్పాల లింబాద్రి

కోరుట్ల, సెప్టెంబరు 22 : ఈ నెల 26 జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాజ్యాధికార సాధనకు బహుజన జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభను విజయ వంతం చేయాలని బీఎస్‌పీ నియోజకవర్గ ఇన్‌చార్జి పుప్పాల లింబాద్రి కోరారు. బుధవారం జైత్రయాత్ర సభ విజయవంతం కోసం బహుజన సమాజ్‌వాదీ పార్టీ  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర పట్టణానికి చేరుకోగా స్థానిక నాయకులతో కలసి స్వాగతం పలికారు. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జైత్రయాత్ర కార్యక్రమానికి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, యుఎస్‌ సభ్యుడు రాంజీ గౌతమ్‌, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌ హాజరై బహుజనులను చైతన్యం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్‌, నాగరాజు, ప్రశాంత్‌, శోభన్‌, కర్నాకర్‌, బాస్కర్‌, వేణు, మనోజ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.