బజాజ్‌ అలెయాంజ్‌ పెన్షన్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2021-03-08T06:29:17+05:30 IST

కస్టమర్ల పెన్షన్‌ అవసరాల కోసం బజాజ్‌ అలెయాంజ్‌ లైఫ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ గోల్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇందులో 9 యాన్యువిటీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి...

బజాజ్‌ అలెయాంజ్‌ పెన్షన్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ: కస్టమర్ల పెన్షన్‌ అవసరాల కోసం బజాజ్‌ అలెయాంజ్‌ లైఫ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ గోల్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇందులో 9 యాన్యువిటీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇది పూర్తిగా జీవిత బీమా ప్లాన్‌. తక్షణ యాన్యువిటీ ప్లాన్‌ లేదా తదుపరి దశలో క్రమం తప్పకుండా రాబడి అందుకునేందుకు డిఫర్డ్‌ యాన్యువిటీ ప్లాన్‌ ఇందులో ఉంటాయి. పాలసీదారుని భార్య కూడా ఆమె జీవించి ఉన్నంత కాలం గ్యారంటీతో కూడిన ఆదాయం అందుకునే ఆప్షన్‌ కూడా ఉంది. జీవితకాలం పాటు నిరంతర ఆదాయం, భార్యాభర్తల్లో ఉభయులకు క్రమం తప్పకుండా రాబడులు అందించే జాయింట్‌ లైఫ్‌ ఆప్షన్‌,  రెండు ఆప్షన్లతో కూడిన పెట్టుబడి వాపసు సదుపాయం కూడా ఉన్నాయి.

Updated Date - 2021-03-08T06:29:17+05:30 IST