బైకుల విక్రయాల్లో మేమే నెంబర్‌-1

ABN , First Publish Date - 2021-05-04T06:25:48+05:30 IST

ఏప్రిల్‌ నెల అమ్మకాల పరంగా చూస్తే దేశంలో తమదే అతి పెద్ద బైక్స్‌ తయారీ కంపెనీ అని బజాజ్‌ ఆటో ప్రకటించింది. గత నెల కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3,48,17 మోటారు సైకిళ్లను...

బైకుల విక్రయాల్లో మేమే నెంబర్‌-1

  • - బజాజ్‌ ఆటో

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ నెల  అమ్మకాల పరంగా చూస్తే దేశంలో తమదే అతి పెద్ద బైక్స్‌ తయారీ కంపెనీ అని బజాజ్‌ ఆటో ప్రకటించింది. గత నెల కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3,48,17 మోటారు సైకిళ్లను విక్రయించింది. ఇందులో 2,21,603 బైక్స్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు తెలిపింది. మోటారు సైకిళ్లు, ఆటోల ఎగుమతిలో బజాజ్‌ ఆటో గత ఏడాది దేశంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది. ఈ మార్కెట్లో కంపెనీకి 60 శాతం వాటా ఉంది. 


Updated Date - 2021-05-04T06:25:48+05:30 IST