అవెంజర్ క్రూయిజ్ 220 బీఎస్6 వెర్షన్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2020-04-04T00:12:43+05:30 IST

అవెంజర్ 220 క్రూయిజ్ బైక్ బీఎస్ 6 వెర్షన్‌కు సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో వెల్లడించింది. బీఎస్ 4

అవెంజర్ క్రూయిజ్ 220 బీఎస్6 వెర్షన్‌ వచ్చేసింది!

న్యూఢిల్లీ:  అవెంజర్ 220 క్రూయిజ్ బైక్ బీఎస్ 6 వెర్షన్‌కు సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో వెల్లడించింది. బీఎస్ 4 మోడల్‌తో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువే. దీని ఎక్స్ షో రూం ధర రూ.1,16,672 మాత్రమే. బీఎస్4 వేరియంట్‌తో పోలిస్తే రూ.11,586 ఎక్కువ. ఈ బైక్‌లో సరికొత్త బీఎస్ 6 ఇంజిన్ అమర్చినప్పటికీ డిజైన్ పరంగా కానీ, ఫీచర్లలో కానీ పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ కలిగిన 220 సీసీ సింగిల్ సిలిండర్ యూనిట్ ఇంజిన్‌ను ఉపయోగించారు. సేఫ్టీ కోసం సింగిల్ చానల్ ఏబీఎస్‌ను ఉపయోగించగా ముందు వీల్‌కు డిస్క్ బ్రేక్, వెనుక వీల్‌కు డ్రమ్ బ్రేక్స్ ఉపయోగించారు.   

Updated Date - 2020-04-04T00:12:43+05:30 IST