‘ధర’ పెంచి... బయటపడింది...

ABN , First Publish Date - 2022-01-20T21:38:37+05:30 IST

ద్విచక్ర వాహన అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన ‘బజాజ్ ఆటో’... మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచేలా ఉన్నాయి.

‘ధర’ పెంచి... బయటపడింది...

హైదరాబాద్ : ద్విచక్ర వాహన అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన ‘బజాజ్ ఆటో’... మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపరచేలా ఉన్నాయి. కాగా... వార్షిక ప్రాతిపదికన 22 % తగ్గిపోయినప్పటికీ, రూ. 1,214.2 కోట్లు లాభాన్ని సాధించడం గమనార్హం. కాగా...  విశ్లేషకులు మాత్రం తమ రూ. 1,195.7 కోట్ల అంచనాలకంటే ఇది కాస్త ఎక్కువేనని చెబుతుండడం విశేషం. ఆపరేషనల్ రెవెన్యూలో 1.3 శాతం వృద్ధితో, వార్షిక ప్రాతిపదికన రూ. 9,021 కోట్ల  ఆదాయం గడించిన బజాజ్ ఆటో... ఈ క్రమంలోనూ... విశ్లేషకుల అంచనాలైన రూ. 8,994 కోట్ల కంటే ఎక్కువే ఆర్జించడం గమనార్హం.


కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ లేనందునే...  వాల్యూమ్స్‌లో 10 శాతం తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. కాగా... కేవలం ఒక్క బజాజ్ ఆటో మాత్రమే కాకుండా... ఈ మూడో త్రైమాసికంలో ఆటోమొబైల్ కంపెనీలకు డిమాండ్ లేకపోవడమే అసలు కారణమన్న అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి. కాగా... ఆదాయం ఇంతగా పెరగడానికి  కారణం... ఉత్పత్తుల ధరలు పెంచడమే. రా మెటీరియల్ ఖరీదు  భారీగా పెరగడం కంపెనీల మార్జిన్లను వేధిస్తున్నట్లు బజాజ్ ఆటో ఫలితాలు నిరూపిస్తున్నాయ్. బజాజ్ ఆటో మార్జిన్లలో 420 బేసిస్ పాయింట్లు తగ్గుదల నమోదు కాగా, ఆపరేటింగ్ మార్జిన్లలో సీక్వెన్షియల్ బేసిస్‌లో మాత్రం కాస్త(80 బేసిస్ పాయింట్లు) పెరగడం ఊరటనిచ్చే అంశమని కంపెనీ చెబుతోంది నిన్నటి(బుధవారం) ట్రేడింగ్‌లో బజాజ్ ఆటో షేర్లు ఒకటిన్నర శాతం పెరిగి, రూ. 3,452.20 వద్ద ముగిసాయి. 

Updated Date - 2022-01-20T21:38:37+05:30 IST