బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌కు యూరప్‌లో పేటెంట్

ABN , First Publish Date - 2020-05-29T00:11:22+05:30 IST

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యూరప్‌లో లాంచ్ చేసేందుకు బజాజ్ సిద్ధమవుతోంది. ఈ మేరకు యూరప్‌లో

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌కు యూరప్‌లో పేటెంట్

న్యూఢిల్లీ: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యూరప్‌లో లాంచ్ చేసేందుకు బజాజ్ సిద్ధమవుతోంది. ఈ మేరకు యూరప్‌లో బజాజ్ చేతక్ డిజైన్‌ను అధికారికంగా రిజిస్టర్ చేసింది. యూరోపియన్ యూనియన్ ఇంటెలెక్చువల్ ప్రాపెర్టీ ఆఫీస్ (ఈయూఐపీవో)లో బజాజ్ సమర్పించిన దరఖాస్తు ప్రకారం.. ఈ డిజైన్ కాలపరిమితి నవంబరు, 2029తో ముగియనుంది. అయితే, ఈ స్కూటర్‌ను యూరోపియన్ మార్కెట్లో ఇప్పట్లో ప్రవేశపెట్టే ప్రణాళిక ఉన్నట్టు బజాజ్  అధికారికంగా ప్రకటించలేదు. 


బజాజ్ చేతక్ ఈ ఏడాది జనవరిలో భారత్‌లో విడుదలైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. పూర్తి మెటల్ బాడీ, లెడ్ డీఆర్ఎల్‌తో రౌండ్ హెడ్‌ల్యాంప్, పెద్ద అలాయ్ వీల్స్, ఇల్యుమినేటెడ్ స్విచ్ గేర్ వంటి ఆకర్షించే ఫీచర్లు ఉన్నాయి. 

Updated Date - 2020-05-29T00:11:22+05:30 IST