Abn logo
Sep 16 2021 @ 19:41PM

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)  చైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు.  2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ రూరల్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా బాజిరెడ్డి ఎన్నికయ్యారు. తనను  టీఎస్‌ఆర్టీసీ  చైర్మన్‌గా నియమించినందుకు  కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. టీఎస్‌ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు.


సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో ఆర్మూరు నుంచి, 2004లో బాన్సువాడ నుంచి , 2014, 2019 లలో నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా బాజిరెడ్డి విజయం  సాధించారు.  సర్పంచ్‌గా, ఎంపీపీగా,  ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాజిరెడ్డి పనిచేసారు. కొన్ని రోజుల క్రితమే టీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్‌ను ప్రభుత్వం నియమించింది.  

ఇవి కూడా చదవండిImage Caption