బజ్జీలు దర్జాగా...

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

వేడి వేడి బజ్జీలు నోరూరించేస్తాయి. వానలు కురిసే వేళ ఇలాంటి చిరుతిండి తినకుండా

బజ్జీలు దర్జాగా...

వేడి వేడి బజ్జీలు నోరూరించేస్తాయి. వానలు కురిసే వేళ ఇలాంటి చిరుతిండి తినకుండా నోరు కట్టేసుకోవలసిన అవసరం లేదు. లావవుతామేమో అనే భయాన్ని పక్కన పెట్టి, దర్జాగా బజ్జీలను లాగించేయమని సలహా ఇస్తూ, బజ్జీలను ఎలా తినాలో కూడా చెప్తోంది ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌!


 ఎయిర్‌ ఫ్రై కాదు, డీప్‌ ఫ్రై చేయండి.


 వేడి వేడి చాయ్‌తో పాటు బజ్జీలు లాగించండి.


 తినేటప్పుడు మనసులో అపరాధ భావం కాదు, పెదవుల మీద పాట ఉండాలి.


 ఒంటరిగా కాదు, స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తూ తినండి.


 రేపు ఖర్చుపెట్టక తప్పనంత క్యాలరీలను పెంచుకోవడం కోసం కాదు, జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం కోసం తినండి.


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST