బిడ్డా.. కొడాలి నాని ఖబడ్ధార్..: భజరంగ్ దళ్

ABN , First Publish Date - 2020-09-23T18:41:34+05:30 IST

బిడ్డా.. కొడాలి నానీ ఖబడ్ధార్ అంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించారు.

బిడ్డా.. కొడాలి నాని ఖబడ్ధార్..: భజరంగ్ దళ్

హైదరాబాద్:  బిడ్డా.. కొడాలి నానీ ఖబడ్దార్ అంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న నానిని మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం లోటస్ పాండ్‌ ముట్టడికి భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2020-09-23T18:41:34+05:30 IST