Abn logo
Aug 1 2021 @ 10:19AM

Tokyo Olympics: సతీష్ కుమార్ పరాజయం.. భారత్ మెడల్ ఆశలు ఆవిరి!

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ సతీష్ కుమార్‌ పోరు ముగిసింది. 91 కిలోల హేవీ వెయిట్ పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో ప్రపంచ నెం.01, ఉజ్బెకిస్తాన్‌ బాక్సర్ బఖోదిర్ జలోలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. మొదటి బౌట్ నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన బఖోదిర్ ఏ దశలోనూ సతీష్‌కు తలొగ్గలేదు. ఇక మూడు బౌట్లలోనూ కనీస పోటీ ఇవ్వని భారత బాక్సర్ మొత్తంగా 27 పాయింట్లు సాధించాడు. అటు ప్రత్యర్థి బఖోదిర్ 30 పాయింట్లు సాధించాడు. సతీష్ కుమార్ ఈ క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో గెలిచి సెమీస్‌కు వెళ్తే, భారత్‌కు మరో పతకం ఖాయం అవుతుందని భావించగా నిరాశే ఎదురైంది.