Abn logo
Nov 21 2020 @ 11:15AM

బాలయ్య హీరోయిన్‌ ఛేంజ్‌..!

Kaakateeya

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం లాక్‌ డౌన్‌ తర్వాత పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సయేషా సైగల్‌ నటించనుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ.. చివరకు హీరోయిన్‌ మారింది. సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్న సమాచారం మేరకు సయేషా సైగల్‌ స్థానంలో కంచె సహా పలు చిత్రాల్లో మెప్పించిన హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ ఇప్పుడు సెట్స్‌లోకి జాయిన్‌ అయ్యిందట. అయితే చివరి నిమిషంలో హీరోయిన్‌ మార్పు ఎందుకు జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. 'సింహా, లెజెండ్‌' చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రమిది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. 


Advertisement
Advertisement