May 8 2021 @ 11:43AM

బాల‌య్య జోడీగా మీనా..?

నందమూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే, గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇందులో బాలయ్య జోడీగా మీనా నటించనుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నారు. అందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా ఓ పాత్ర‌లో, ఫ్యాక్ష‌నిస్ట్‌గా మ‌రో పాత్ర‌లో క‌నిపిస్తార‌ట. బాలయ్య రెండు పాత్రలకు తగ్గట్లు ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తారు. ఈ ఇద్ద‌రు హీరోయిన్స్‌లో..మెయిన్‌ హీరోయిన్‌గా శ్రుతిహాస‌న్ పేరు వినిపిస్తే, మ‌రో హీరోయిన్‌గా ఇప్పుడు మీనా పేరు వినిపిస్తోంది. మీనా పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో క‌నిపిస్తుంద‌ని స‌మాచారం.ఇదే కనుక నిజమైతే ‘ముద్దుల మొగుడు, క్రిష్ణ‌బాబు, బొబ్బిలి సింహం, అశ్వ‌మేథం’ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, మీనా న‌టించే మూవీ ఇదే అవుతుంది. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.