Abn logo
Feb 27 2021 @ 13:33PM

ఆ సినిమాలో బాలకృష్ణ లేడు.. నాగార్జున లేడు...

యువ కథానాయకుడు నాగశౌర్య వరుస సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు కాకుండా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర ఉంది. ఆ పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ లేదా అక్కినేని నాగార్జున‌ను న‌టింప చేయ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రిగాయి. అయితే ఇద్ద‌రు అగ్ర హీరోలు ప్ర‌స్తుతం ఉన్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా వారు సద‌రు సినిమాలో న‌టించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 

ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాసుకున్న ఈ క‌థ‌లో నాగ‌శౌర్య బ‌ధిరుడిగా క‌నిపిస్తాడ‌నే వార్త‌లు కూడా వినిపించాయి. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర‌లో న‌టిస్తే తన‌కు ఎంతో పేరు వ‌స్తుంద‌ని భావించిన నాగ‌శౌర్య కూడా సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. అయితే ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో సినిమాను ప‌క్క‌న పెట్టేశారు. 

Advertisement
Advertisement
Advertisement