Abn logo
Oct 28 2020 @ 01:30AM

గోన గన్నారెడ్డిగా బాలకృష్ణ

Kaakateeya

నందమూరి బాలకృష్ణ మరో చారిత్రక పాత్ర పోషించనున్నారు. జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో తండ్రి ఎన్టీఆర్‌కు తగ్గ తనయుడనిపించుకొన్న బాలకృష్ణ  ఇంతకుముందు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా నటించి ప్రశంసలు అందుకొన్న సంగతి విదితమే. ఇప్పుడు మరో చారిత్రక వీరుడు   గోన గన్నారెడ్డిగా ఆయన  తెరపై కనిపించి అభిమానులను అలరించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం తర్వాత ‘గోన గన్నారెడ్డి’ ప్రారంభమవుతుందని సమాచారం.  ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది త్వరలో తెలుస్తుంది.


Advertisement
Advertisement