Abn logo
May 16 2020 @ 08:21AM

వైవిధ్య‌మైన పాత్ర‌లో బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక‌మునుపే బాల‌కృష్ణ త‌న 107వ సినిమాకు రంగం సిద్దం చేసుకుంటున్నార‌ట‌. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే బోయ‌పాటి శ్రీను సినిమాను పూర్తి చేసిన బాల‌య్య ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా త‌న 107వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ‌తారని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement