Abn logo
Aug 1 2020 @ 20:03PM

మాణిక్యాలరావు మృతి దిగ్భ్రాంతిని కలిగించింది: బాలకృష్ణ

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా మహమ్మారి వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. ఆయన మరణవార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం చాలా బాధాకరం అన్నారు హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. 

 

‘‘మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఇది చాలా బాధాకరమైన వార్త. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖా మంత్రిగా ఆయన సేవలందించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని బాలకృష్ణ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement