Abn logo
May 16 2020 @ 12:10PM

బాలయ్య ఆ సినిమా చూస్తానన్నారట!

మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పన్ కోషియమ్` సినిమా గురించి ఇటీవల టాలీవుడ్‌లో ఎక్కువ చర్చ జరుగుతోంది. కోటి పది లక్షల రూపాయలకు ఈ సినిమా రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులో నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానాతో రీమేక్ చేయాలనేది సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఆలోచన. 


రీమేక్ ప్రతిపాదనతో ఇప్పటికే నిర్మాతలు బాలయ్యను కలిసినట్టు సమాచారం. బాలయ్య కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా చూసి తన నిర్ణయం చెబుతానని బాలయ్య అన్నారట. లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత బాలయ్య ఈ సినిమాను చూడబోతున్నారట. బాలయ్య ఓకే అంటే రానాతో కూడా సంప్రదింపులు జరపాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత దర్శకుడి గురించి ఆలోచిస్తారట. 


Advertisement
Advertisement
Advertisement