బాలమిత్ర కోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-09-17T03:14:26+05:30 IST

9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు బాలమిత్ర కోర్టు

బాలమిత్ర కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు బాలమిత్ర కోర్టు కఠిన శిక్ష విధించింది. బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బాలమిత్ర కోర్టు తీర్పునిచ్చింది. బాలుడిని వేధించిన ఆయాకు 20ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానాను కోర్టు విధించింది. పాతబస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 9ఏళ్ల  బాలుడిని పాతికేళ్ల ఆయా లైంగిక వేధింపులకు గురిచేసింది. 2017 డిసెంబర్‌లో చాంద్రాయణగుట్ట పీఎస్‌లో కేసు నమోదు అయింది. పోక్సో కింద కేసు నమోదు చేసి చాంద్రాయణగుట్ట పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. ఆయాకు 20 ఏళ్ల జైలు, రూ.10 వేలు జరిమానాను బాలమిత్ర కోర్టు విధించింది.  

Updated Date - 2021-09-17T03:14:26+05:30 IST