Abn logo
Sep 19 2021 @ 10:34AM

బాలపూర్ లడ్డూను దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్

హైదరాబాద్: బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ కృపతో తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వేలంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండిImage Caption