ఇంటి గుట్టు లాగుతున్నారు!

ABN , First Publish Date - 2020-06-04T11:15:37+05:30 IST

డెల్టా మండలాల పరిధిలో జరిగిన ఇళ్ల స్థలాల భూ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు.

ఇంటి గుట్టు లాగుతున్నారు!

భూకుంభకోణంపై విచారణ జరపాలి : బలరాం


భీమవరం అర్బన్‌, జూన్‌ 3 : డెల్టా మండలాల పరిధిలో జరిగిన ఇళ్ల స్థలాల భూ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం  డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో జరిగిన ఇళ్ల స్థలాల భూ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ఒక వైపు చెప్పుకుంటుండగా మరో వైపు గృహనిర్మాణశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈ కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారడం సిగ్గుచేటని విమర్శించారు.


ఇళ్ల స్థలాలకు లబ్ధిదారుల నుంచి రూ.20 నుంచి 80 వేలు వరకు వసూలు చేయడం దారుణమన్నారు. డబ్బులు వసూళ్లను అధికార పార్టీకే చెందిన నరసాపురం ఎంపీ కూడా ధ్రువీకరిస్తూ ప్రకటనలు చేశారన్నారు.పెనుగొండ మండలంలో ఫిర్యాదు చేసిన వారిపై దాడి చేశారన్నారు.డబ్బు వసూలు చేసినవారిపై చర్యలు తీసుకుని పేదలకు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకతీతంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు. 

Updated Date - 2020-06-04T11:15:37+05:30 IST