May 16 2021 @ 13:45PM

జూలై నుంచి 'క్రాక్' దర్శకుడితో బాలయ్య సినిమా..?

జూలై నుంచి బాలయ్య కొత్త సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్' సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని నెక్స్ట్ మూవీని బాలయ్యతో చేసేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ చేసే పనిలో ఉన్న ఈయన పవర్‌ఫుల్ రోల్‌లో బాలయ్యను చూపించబోతున్నట్టు ఇంతక ముందే వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా త్వరలో అధికారక ప్రకటన విడుదల చేసి జూలై నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూలై నుంచి టాలీవుడ్‌లో కొన్ని సినిమాల చిత్రీకరణకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున - ప్రవీణ్ సత్తారు సినిమా కూడా ఆగస్టు నుంచి సెట్స్ మీదకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేని - బాలయ్య ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కడానికి రెడీ అవుతుందట. ప్రస్తుతం బోయపాటి శ్రీను - బాలయ్య కాంబోలో 'అఖండ' రూపొందుతున్న సంగతి తెలిసిందే.