Viral Video: బాబోయ్.. ఇడ్లీలు నల్లగా ఉన్నాయేంటి..? అవాక్కవుతున్న ఆహార ప్రియులు.. రుచిచూస్తే, లాభాలు తెలిస్తే వదిలిపెట్టరట..!

ABN , First Publish Date - 2021-12-17T21:05:17+05:30 IST

భారతీయులకు, అందులోనూ దక్షిణ భారతీయులకు ఇడ్లీలంటే మక్కువ ఎక్కువ.

Viral Video: బాబోయ్.. ఇడ్లీలు నల్లగా ఉన్నాయేంటి..? అవాక్కవుతున్న ఆహార ప్రియులు.. రుచిచూస్తే, లాభాలు తెలిస్తే వదిలిపెట్టరట..!

భారతీయులకు, అందులోనూ దక్షిణ భారతీయులకు ఇడ్లీలంటే మక్కువ ఎక్కువ. తెల్లగా మల్లెపూవుల్లా ఉండే ఇడ్లీలను ఆవురావురుమంటూ లాగిస్తారు. ఇడ్లీలంటే తెల్లగానే ఉంటాయని ఇప్పటి వరకు అనుకున్నాం. అయితే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఇడ్లీలను నల్లగా తయారు చేస్తున్నారు. ఆ నల్ల ఇడ్లీలు రెండు తినాలంటే రూ.90 రూపాయలు చెల్లించాల్సిందే. రెండు ఇడ్లీలకు.. పైగా నల్లవాటికి అంత ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? అంటే.. అందులోనే ఉంది అసలు రహస్యం. 


ఆ నల్ల ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివట. వీటిని డిటాక్స్ ఇడ్లీ అంటారు. వీటిని తింటే శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయట. ఈ మధ్య డిటాక్సిఫికేషన్ ఫుడ్‌కు ఆదరణ పెరిగింది. డిటాక్సిఫికేషన్ ఫుడ్ పేరుతో రకరకాల ఆహార పదార్థాలు పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో ఈ నల్ల ఇడ్లీలు ఒకటి. ఫుడ్ బ్లాగర్స్ వివేక్, అయేషా ఈ బ్లాక్ ఇడ్లీలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇవి శరీరానికి మంచి చేస్తాయని చెబుతున్నారు. అయితే వీటిని గర్భిణీలు తినకూడదట. ఈ వీడియోను ఇప్పటి వరకు 15 లక్షల మంది వీక్షించారు. 90వేల మందికి పైగా లైక్ చేశారు.



Updated Date - 2021-12-17T21:05:17+05:30 IST