Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 26 2021 @ 14:56PM

ఆ విషయంలో బీజేపీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: బాల్క సుమన్

కరీంనగర్: అబద్ధాలు ఆడటంలో బీజేపీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే.. హుజురాబాద్ నాశనమైనట్లేనన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారే బీజేపీలో ఉంటున్నారని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నారు. సానుభూతి ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈటెల రాజేందర్.. భారీ గా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement