Abn logo
Aug 15 2020 @ 00:37AM

బాలూ...త్వరగా కోలుకొని రా...

ప్రముఖ గాయకుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే! గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆయన పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందనీ, నిపుణులైన వైద్యులు పర్యవేక్షిస్తున్నారనీ, లైఫ్‌ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నామని చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు అధికారికంగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నాయి. తను ఆరోగ్యంగానే ఉన్నట్లు బాలు సంకేతమిచ్చిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన తనయుడు ఎస్‌.పి.చరణ్‌ తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని ట్వీట్‌ చేశారు. ‘‘నాన్నగారి ఆరోగ్యం విషమంగా ఉన్న మాట నిజమే! కానీ ఎమ్‌జీఎమ్‌ ఆస్పత్రిలో ఆయన సేఫ్‌ హ్యాండ్‌లో ఉన్నారు. త్వరలో ఆయన కోలుకొని ఆరోగ్యంగా తిరిగివస్తారు’’ అని చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.


‘‘బాలూ.. త్వరగా లేచిరా! నీకోసం కాచుకుని కూర్చున్నాను. మన ప్రయాణం సినిమాతో ప్రారంభం కాలేదు. అలాగే సినిమాతో ముగిసిపోయేది కాదు. సంగీతం మన జీవితానికి ఓ ఆధారంగానే నిలిచింది. ేస్టజీ కచేరీలపై ప్రారంభమైన మన ేస్నహం, సంగీతం ఒకదాన్ని ఒకటి విడిచి ఎలా ఉండలేదో, అలాగే మన ేస్నహం ఎప్పుడూ విడిపోలేదు. మన మధ్య గొడవ ఉన్నా, లేకున్నా అది ేస్నహమే. ఈ విషయం మన ఇద్దరికి బాగా తెలుసు. నువ్వు తిరిగి వస్తావని నా మనసు చెబుతోంది. అదే జరగాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను..’’

- ఇళయరాజా


‘నా ప్రాణ స్నేహితుడు బాలుకి ఆత్మస్థైర్యం ఎక్కువ. ఆయన కృషి బలమైనది. బాలు కొలిచే దేవుళ్లు, నేను కొలిచే దైవాలు ఆయన్ని ఆరోగ్యవంతంగా మాకు అందిస్తాయనే నమ్మకంతో ఉన్నాం’’. 

- భారతీరాజా 

‘సంగీత ప్రియులందరికీ ఇదే నా విన్నపం. మన లెజెండ్‌ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి. ఆయన గానంతో మనల్ని ఎంతో రంజింపచేశారు’’ 

- ఎ.ఆర్‌.రెహమాన్‌ 

‘గాన గంధర్వుడు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగొచ్చి సంగీత ప్రియులను అలరించాలని కోరుకుంటున్నాను’ 

- దేవిశ్రీ ప్రసాద్‌

‘బాలుగారు చాలా స్ర్టాంగ్‌. ప్రస్తుత పరిస్థితిని నుండి తప్పక బయటపడతారని నా నమ్మకం. అదే జరగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా’

- చిత్ర


‘డియరెస్ట్‌ బ్రదర్‌ బాలుగారూ మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’

- చిరంజీవి

‘డియర్‌ ఎస్‌పీబీ సర్‌.. మీరు త్వరలో కోలుకోవాలి. ఆరోగ్యంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నా’

- అనిరుద్ధ్‌ 

‘బాలసుబ్రహ్మణ్యంగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందింది’

- రామజోగయ్య శాస్త్రి

‘మా అందరి ప్రార్థనలు బాలుగారికి ఉన్నాయి. మామా నువ్వు కరోనాతో పోరాడి గెలిచి తీరతావని నాకు తెలుసు. మీ కోసం నేను ట్యూన్స్‌ చేస్తున్నా. వాటికి మీరు 

పాడతారు కూడా’

- ఎస్‌.ఎస్‌.తమన్‌

ధనుశ్‌, కీర్తీ సురేశ్‌, బోనీ కపూర్‌, రాధికాశరత్‌కుమార్‌, ఖుష్బూ, సౌందర్య రజనీకాంత్‌, చిన్నయి తదితరులు కూడా బాలు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రార్థిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement