Advertisement
Advertisement
Abn logo
Advertisement

విదేశీయుల రాకపై నిషేధాన్ని పొడిగించిన కువైట్

కువైట్ సిటీ: కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు కువైట్  విదేశీయుల రాకపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ బ్యాన్ కొనసాగుతుందని తాజాగా కువైట్ మంత్రి మండలి స్పష్టం చేసింది. అంటే ఈ నిర్ణయంతో కొన్ని వర్గాలను మినహాయించి విదేశీ పౌరులను కువైట్‌లోకి అనుమతించరు. మెడికల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, దౌత్యవేత్తలు, డొమెస్టిక్ వర్కర్స్‌కు కువైట్‌లో ప్రవేశానికి అనుమతి ఉంది. గత నెలలో కరోనా కేసులు, మరణాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కువైట్ సర్కార్ విదేశీయలు రాకపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యాన్‌ను మళ్లీ పొడిగిస్తూ ఆ దేశ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉంటే.. కువైట్‌పై తీవ్ర ప్రభావం చూపిన మహమ్మారి ఇప్పటివరకూ 2,34,754 మందికి ప్రబలగా.. 1,327 మందిని పొట్టనబెట్టుకుంది. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement