అరటి మఫిన్స్‌

ABN , First Publish Date - 2021-12-22T17:50:37+05:30 IST

గోధుమ పిండి- కప్పున్నర, అరటి పళ్లు - మూడు, చక్కెర - పావు కప్పు, బేకింగ్‌ సోడా- అర స్పూను, బేకింగ్‌ పౌడర్‌- స్పూను, ఉప్పు- చిటికెడు, నిమ్మరసం- స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- స్పూను

అరటి మఫిన్స్‌

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- కప్పున్నర, అరటి పళ్లు - మూడు, చక్కెర - పావు కప్పు, బేకింగ్‌ సోడా- అర స్పూను, బేకింగ్‌ పౌడర్‌- స్పూను, ఉప్పు- చిటికెడు, నిమ్మరసం- స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- స్పూను.


తయారుచేసే విధానం: గిన్నెలో అరటి ముక్కలు, చక్కెర వేసి గుజ్జుగా చేయాలి. ఇందులో వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, నిమ్మరసాన్ని కలపాలి. ఆ తరవాత గోధుమ పిండి, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పును కూడా జతచేయాలి. ఈ పిండిని మఫిన్‌ ట్రేలో వేసి ఓవెన్‌లో బేక్‌ చేస్తే రుచికరమైన అరటి మఫిన్స్‌ తయారు.

Updated Date - 2021-12-22T17:50:37+05:30 IST