బనానా పకోడీ

ABN , First Publish Date - 2020-02-15T17:18:29+05:30 IST

అరటికాయలు - ఆరు, జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఛాట్‌ మసాలా - ఒకటిన్నర టీస్పూన్‌, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - ఆరు, నిమ్మకాయలు - నాలుగు, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, సెనగపిండి - అరకేజీ,

బనానా పకోడీ

కావలసినవి : అరటికాయలు - ఆరు, జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఛాట్‌ మసాలా - ఒకటిన్నర టీస్పూన్‌, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - ఆరు, నిమ్మకాయలు - నాలుగు, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, సెనగపిండి - అరకేజీ, బియ్యప్పిండి - 200 గ్రాములు, ఎండుమిర్చి - రెండు. 


తయారీ : అరటికాయల పొట్టు తీసి కట్‌ చేసి పెట్టుకోవాలి. 

ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి తీసుకుని బాగా కలపాలి.

అందులో జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఛాట్‌ మసాలా, పచ్చిమిర్చి, మామిడికాయ పొడి, తగినంత ఉప్పు, మెత్తగా దంచిన అల్లం, ఎండుమిర్చి వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టాలి.

ఇప్పుడు ఒక పాన్‌లో నూనె పోసి వేడి అయ్యాక అరటికాయ ముక్కలను మిశ్రమంలో అద్దుకుంటూ నూనెలో వేసి వేగించాలి. 

చట్నీతో వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి. 

Updated Date - 2020-02-15T17:18:29+05:30 IST