వివాహ వేడుకల్లో పిల్లలతో బ్యాండ్ బాజా బరాత్ గ్యాంగ్ దొంగతనాలు

ABN , First Publish Date - 2020-12-05T17:41:03+05:30 IST

వివాహ వేడుకల్లో పిల్లలతో దొంగతనాలు చేయించిన బ్యాండ్ బాజా బరాత్ గ్యాంగ్ బాగోతాన్ని ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు....

వివాహ వేడుకల్లో పిల్లలతో బ్యాండ్ బాజా బరాత్ గ్యాంగ్ దొంగతనాలు

న్యూఢిల్లీ : వివాహ వేడుకల్లో పిల్లలతో దొంగతనాలు చేయించిన బ్యాండ్ బాజా బరాత్ గ్యాంగ్ బాగోతాన్ని ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ నగరంలో పిల్లలతో దొంగతనాలు చేయించిన బ్యాండ్ బాజా బరాత్ గ్యాంగుకు చెందిన ఏడుగురు నిందితులను, ఇద్దరు బాలలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీ ముఠా గ్రామాల నుంచి పిల్లల్ని ఏడాదికి 10 నుంచి 12 లక్షల రూపాయల కాంట్రాక్టుపై లీజుకు తీసుకొని వారితోనే వివాహవేడుకల్లో దోపిడీలు చేయిస్తారు. ఈ ముఠా సభ్యులు ఏడుగురు ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ కు వెళుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ లోని గుల్ఖేరి గ్రామానికి చెందిన ముఠా సభ్యులు వివాహ వేడుకల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాయి.


ముఠా సభ్యులు 9-15 ఏళ్ల వయసుగల పిల్లల్ని లీజుకు తీసుకున్నారని దర్యాప్తులో తేలింది. పిల్లల నైపుణ్యాన్ని బట్టి ఏడాదికి రూ.10 నుంచి 12 లక్షలకు లీజుకు తీసుకున్నారని పోలీసులు వివరించారు.పిల్లలను లీజుకు తీసుకున్నాక వారికి ఢిల్లీకి తీసుకువచ్చి నెలరోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఒకవేళ వారు దొరికిన ముఠా సభ్యుల గురించి వెల్లడించవద్దని కోరారు. అరెస్టు అయిన నిందితుల్లో సందీప్ (26), హన్స్‌రాజ్ (21), సంత్ కుమార్ (32), కిషన్ (22), బిషాల్ (20) లుగా గుర్తించారు.


 వివాహ వేడుకల్లో వీడియో ఫుటేజీలను విశ్లేషించడంతోపాటు వివాహ వేడుకల్లో ఇన్ ఫార్మర్లను నియమించడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. నిందితులు దొంగతనానికి ముందు అతిథులతో పరిచయం పెంచుకున్నారని వీడియో ఫుటేజీల్లో తేలింది. ఖరీదైన దుస్తులు ధరించి వివాహ వేడుకల్లో పాల్గొన్న దొంగల ముఠా సభ్యులు అతిథులతో కలిసిపోయి విందు భోజనం చేసి అనంతరం బహుమతి సంచులు, ఆభరణాలు, నగదును దొంగిలించి అదృశ్యమవుతుంటారని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-12-05T17:41:03+05:30 IST