బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-03-06T06:12:15+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ ముమ్మిడివరంలో విజయవంతమైంది.

బంద్‌ విజయవంతం

ముమ్మిడివరం, మార్చి 5: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ ముమ్మిడివరంలో విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వర్తక వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ పాటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా మూతపడ్డాయి. అఖిలపక్షం, ప్రజాసంఘాల నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం నుంచి 10వ మైలురాయి సెంటర్‌వరకు మోటారుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమశిబిరంలో చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సందర్శించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ఆర్‌పీఐ, బీఎస్పీ, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నాయకులు జి.దుర్గాప్రసాద్‌, వడ్డి నాగేశ్వరరావు, పాము బాలయ్య, దొమ్మేటి వీరరాఘవులు, సకిలే సూర్యనారాయణ, పి.ఉదయభాస్కరవర్మ, పెన్మెత్స జగ్గప్పరాజు, డి.ఆంజనేయులు, చీకురుమిల్లి శ్రీనివాస్‌, వనచర్ల విజయకుమార్‌, జి.అనంతలక్ష్మి, బొంతు శ్రీను, నిమ్మకాయల వెంకటేష్‌, బి.సతీష్‌, పెయ్యల చిట్టిబాబు, కాశి బాలమునికుమారి తదితరులుపాల్గొన్నారు. 

అమలాపురం టౌన్‌: విశాఖ స్టీలుప్లాంట్‌ ప్రైవే టీకరణను నిరసిస్తూ ఆర్పీఐ జిల్లా శాఖ అధ్యక్షుడు గిడ్డి జ్ఞానప్రకాశరావు ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం ప్రైవేటీక రణ విధానానికి స్వస్తి పలకాలని కోరుతూ  ఎంపీ చింతా అనురాధకు నాయకులు వినతిపత్రం అందచేశారు. ఈఅంశంపై పార్లమెంటులో చర్చిస్తామని హామీనిచ్చారు. రాస్తారోకోలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎం రుషి, ఈవీవీ సత్యనారాయణ, పెనుమాల చిట్టిబాబు, బడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ఆలమూరు: వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో మండలంలో చేపట్టిన సమ్మె  సంపూర్ణంగా జరిగింది. షాపులు, బ్యాంకులు, స్కూల్స్‌, వ్యాపార సంస్థలను బంద్‌ చేయించారు.  స్థానిక మెయిన్‌రోడ్డులో విశాఖ ఉక్కుకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రామానుజుల శేషగిరిరావు, ఈదల నల్లబాబు, సాలి సత్యనారాయణ,  వైసీపీ నేతలు కొప్పనాతి శ్రీనివాస్‌, కమ్యూనిస్టు నాయకులు కె.రామకృష్ణ, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కాట్రేనికోన: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం శుక్రవారం చేపట్టిన బంద్‌ మండలంలో ప్రశాంతంగా జరిగింది.  సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకుడు నడింపల్లి రామకృష్ణంరాజు, సీఐటీయూ కార్యదర్శి విత్తనాల రాంబాబు, ఉపాధ్యక్షుడు విప్పర్తి మోహనరావు, కోశాధికారి అయితాబత్తుల శ్రీనివాస్‌, కమిడి శ్రీని వాసరావు, రాయపురెడ్డి కృష్ణ, ఎం.మహేశ్వరి, మోకా మేరి, మోకా సుహాసిని, ఎం.మంగాదేవి, మట్ట రమాదేవి, ఆర్‌.మంగాయమ్మ, మహాలక్ష్మి, బి.శ్రీదేవి,  పాల్గొన్నారు.

రాయవరం: మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. రాయవరంలో సీఐటీయూ జిల్లా నాయకురాలు డి.ఆదిలక్ష్మి, సీఐటీయూ మండల అధ్యక్షురాలు పి.సత్యవతి ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దారు ప్రకాష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ద్రాక్షారామ: ద్రాక్షారామలో బంద్‌ పాక్షికంగా జరిగింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమశంకరం, గుబ్బల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రావులపాలెం రూరల్‌: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా జరిగింది.  రావులపాలెంలో దుకాణాలు, ఇతర వ్యాపార కూడళ్లు పాక్షికంగా బంద్‌ పాటించాయి.   మధ్యాహ్నం వరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల రాకపోకలను నిలిపివేయడంతో కాంప్లెక్స్‌ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. బంద్‌కు ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు మద్దతు తెలిపాయి. 

అయినవిల్లి: విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీక రిం చడాన్ని నిరసిస్తూ టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వ ర్యంలో శుక్రవారం బంద్‌  నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్యనాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మోత వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముషిణి సుబ్బారావు, కోలా అర్జునరావు, కుడుపూడి రాఘవమ్మ తదితరులు పాల్గొన్నారు.

మామిడికుదురు: విశాఖ స్టీలుప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని టీడీపీ నాయ కులు డిమాండు చేశారు.  మండలంలోని పాఠశాలలు,  బ్యాంకులు, దుకాణ  సముదాయాలను మూసివేయిం చారు.  కార్యక్రమంలో చుట్టుగుళ్ల కిశోర్‌, జాన సుబ్బారావు, ఈలి శ్రీనివాస్‌, చుట్టుగుళ్ల దుర్గావతి, జాలెం ఉమాపార్వతి, కోళ్ల సురేష్‌బాబు, చెల్లింగి రామకృష్ణ, తోట పెద్దబ్బులు, కొల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.  

మలికిపురం: మండలంలో సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌, రాజోలు పరిరక్షణ చైతన్యసమితి, మానవహక్కుల సం ఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌ విజయ వంతమైంది. వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూత బడ్డాయి. కార్యక్రమంలో దేవ రాజేంద్రప్రసాద్‌, చెల్లు బోయిన కేశవశెట్టి, కొండా సత్తిబాబు, కొల్లాబత్తుల వీర్రాజు, ముత్యాల శ్రీనివాసరావు, తాడి సహదేవ్‌, ముదు నూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. 

రాజోలు: 32మంది ప్రాణాత్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రాజోలులో నిర్వహించిన బంద్‌ విజయవంత మైంది.  బంద్‌లో  గొల్లపల్లి సూర్యారావు, వామపక్షాల నాయకులు పీతల రామచంద్రరావు, దేవ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలను మూయించి వేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. చాగంటి స్వామి, కసుకుర్తి త్రినాథస్వామి, మోకా పార్వతి, గ్రామశాఖ అధ్యక్షుడు బేతినీడి శ్రీనివాస్‌, సర్పంచ్‌ ముదునూరి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

అంతర్వేది: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ సఖినేటిపల్లి మండలంలో బంద్‌ ప్రశాంతంగా నిర్వహించారు. ఆంధ్రులు హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడడమే లక్ష్యంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌ పాటించాయి.

రామచంద్రపురం: పట్టణంలోని వర్తక, వ్యాపార, విద్యా సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. వామపక్షాల నాయకులు ఎంవీ రమణ, జి.సూరిబాబు, వి. భీమశంకరం, ఉండవిల్లి గోపాలరావు, గాలింకి చిట్టి బాబు, ఎం.దుర్గమ్మ, పి.రాము, కె.సత్తిరెడ్డి, పి.సత్యనారా యణ, ఎం. ప్రేమానందం, ఎం.రాముడు, జి.కుమారి, లాజర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-06T06:12:15+05:30 IST