Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీనియర్ పాత్రికేయుడు చలసాని మృతికి బండారు సంతాపం

విజయవాడ: సీనియర్ పాత్రికేయుడు చలసాని రాజేంద్రప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నాగేష్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 


సుదీర్ఘకాలం పాటు ఆంధ్రజ్యోతిలో వివిధ హోదాల్లో కొనసాగిన రాజేంద్రప్రసాద్.. పాత్రికేయ రంగంలో మూడు దశాబ్దాలకుపైగా విశేష సేవలందించారని కొనియాడారు. నిబద్దత గల పాత్రికేయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. చలసాని రాజేంద్రప్రసాద్ గారి మృతి.. పత్రికా రంగానికి తీరని లోటని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

Advertisement
Advertisement