Abn logo
Jan 19 2021 @ 13:45PM

వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు టీడీపీ నేత అప్పలనాయుడు సవాల్

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు టీడీపీ నేత బండారు అప్పలనాయుడు సవాల్ విసిరారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తనదేనంటున్న అదీప్‌రాజ్.. అది తన స్వంత భూమేనని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదీప్‌రాజ్ ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో ఐపీసీ బదులు జేపీసీ నడుస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని.. ఒక అర్జీ పెట్టి ఆ భూమి తమదే అంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెబుతున్న స్థలానికి ఈ రోజు వరకు ప్రభుత్వ అనుమతి రాలేదు కాబట్టి అది ప్రభుత్వ భూమేనని అన్నారు. అదీప్‌రాజ్ కబ్జాదారుడు కాదో అవునో రెవిన్యూ విభాగమే చెప్పాలన్నారు. ఆరు ఎకరాల భూమి తమదేనని సాయి బాబా ఆలయంలో అదీప్ రాజ్ ప్రమాణం చేయగలరా? అని అప్పలనాయుడు సవాల్ విసిరారు. తన సవాల్‌ను ఆయన స్వీకరించాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement