Abn logo
Sep 27 2021 @ 23:34PM

బంద్‌ ప్రశాంతం

కడప ఆర్టీసీ బస్టాండు వద్ద బంద్‌లో పాల్గొన్న వామపక్ష నేతలు

పాల్గొన్న వామపక్షాలు, రైతులు  

మోదీకి వ్యతిరేకంగా నినాదాలు 


           కడప, కమలాపురం నియోజకవర్గాల్లో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల నిరసనలు తెలిపి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.


కడప(రవీంద్రనగర్‌), సెప్టెంబరు 27: కడప నగరంలో భారత్‌ బంద్‌ సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ, విద్యాసంస్థలు, బ్యాంకులు, వివిధ వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసి వేశారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న మోదీ గద్దె దిగేంత వరకు పోరాటాలు ఆగవని వామపక్ష పార్టీలు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు, విద్యార్థి సంఘాలు అన్నారు. తెల్లవారు జాము నుంచే వారు బంద్‌లో పాల్గొన్నారు. సీపీఐ నాయకులు కట్టలపొయ్యి మీద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు అమీర్‌బాబు, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌ల ఆధ్వర్యంలో స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. మోదీ డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఏపీ రైతు సంఘం నాయకులు పాలంపల్లె వద్ద నుంచి కోటిరెడ్డిసర్కిల్‌ వరకు రైతుల ట్రాక్టర్‌లో మోదీ దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి కోటిరెడ్డి కూడలి వద్ద కూరగాయలు రోడ్డుపై పారబోసి, మోదీ, అంబానీ, అదానీ మూడు తలల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర నాయకులు నారాయణలు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. అనంతరం టీడీపీ నాయకుడు అమీర్‌బాబు, గోవర్ధన్‌రెడ్డిలు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తుంటే మోదీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలోని ప్రధాన కూడళ్లలో చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, నాగసుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, సుబ్రమణ్యం, చంద్ర, బషీరున్నీసా, విజయలక్ష్మి, మద్దిలేటి, రామ్మోహన్‌, దస్తగిరిరెడ్డి, టీడీపీ, కాంగ్రెస్‌, ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో.. 

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 27: ప్రధాని నిరంకుశ వైఖరిని తిప్పికొట్టే రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక చరమగీతం పాడతారని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి నగరంలోని అన్ని కూడళ్లలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నేతలు ధ్రువకుమార్‌ రెడ్డి, తిరుమలేశు, సుబ్బారెడ్డి, బాబు, యూత్‌ కాంగ్రెస్‌ నేతలు లక్ష్ముయ్య, చెప్పలి పుల్లయ్య, మహిళా అధ్యక్షురాలు శ్యామల, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


చెన్నూరులో: 

మండలంలో అన్ని పార్టీలు భారత్‌ బంద్‌లో పాల్గొ న్నాయి. ఉదయం 10 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా కమలాపురం నియోజకవర్గ కాంగ్రె్‌స పార్టీ ఇన్‌చార్జ్‌ పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయానికి తాళం వేశారు. అలాగే కొన్ని చోట్ల దుకాణాలు మూయించారు. అయితే వైసీపీలో, టీడీపీలో ఒకరిద్దరు మినహాయిస్తే ప్రధాన పార్టీల నాయకులెవ్వరూ బంద్‌లో పాల్గొనలేదు. షాపులు యథావిధిగా తెరచి ఉన్నాయి. కార్యక్రమాల్లో  కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ నాగరాజరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. 


వైవీయూలో: 

వైవీయూలో ఎస్‌ఎ్‌ఫఐ, విద్యార్థి సంఘాల నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజారైతు కార్మిక యువజన విధానాలను నిరసిస్తూ వైవీయూలోని బాలుర వసతి గృహం వద్ద ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు ఎంఆర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో బంద్‌ పాటించారు. 


కమలాపురంలో: 

మండలంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథశర్మ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అన్నదాతను ఆదుకోలేని చట్టాలు రైతాంగానికి అవసరం లేదని, ఇటువంటి చట్టాల వలన అన్నంపెటే ్ట అన్నదాత తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతాంగానికి మద్దతుగా నినాదాలు చేస్తూ తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌, టీడీపీ, మైనార్టీ జిల్లా నాయకుడు ఖాదర్‌బాష, టీడీపీ మండల కన్వీనర్‌ రాఘవరెడ్డి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.


వీరపునాయునిపల్లెలో: 

మండలంలో భారత్‌బంద్‌ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి మల్లికార్జునరెడ్డి, వైసీపీ నాయకులు రవీంద్రారెడ్డి, శ్రీనివాసులరెడ్డిలతో పాటు మరి కొంతమంది రైతులతో కలిసి బంద్‌ నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. 


పెండ్లిమర్రిలో: 

రైతు వ్యతిరేక వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యవసాయ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలో బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌పై రైతులతో కలిసి కార్మిక సంఘం సభ్యులు బంద్‌ను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అన్వేష్‌, మండల అధ్యక్షులు చెన్నయ్య, నాయకులు అయ్యవారు, సుబ్బారెడ్డి, సుబ్బమ్మ, సుంకమ్మ పాల్గొన్నారు. 


సీకేదిన్నెలో: 

వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌ మండలంలో ప్రశాంతంగా జరిగింది. మండలంలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు. వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.