Abn logo
Sep 28 2021 @ 12:05PM

భారత్‌బంద్‌ ప్రశాంతం

అఖిలపక్షాల ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసనలు 

అడ్డుకున్న పోలీసులు... పలువురి అరెస్ట్‌


 కేంద్రం రూపొందించిన వ్యవసాయ, రైతు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం చేపట్టిన జాతీయ అఖిలపక్ష పార్టీల బంద్‌ ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల తెల్లవారుజామునే డిపోల వద్దకు, రోడ్లపైకి వచ్చిన ఆయా పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఒకవైపు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఆందోళనలో పాల్గొన్నారు. డిపోలనుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై టీజేఎస్‌ నేత కోదండరామ్‌, కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కి, మల్లురవి, చాడ వెంకటరెడ్డి తదితరులు ఆందోళనలు చేపట్టగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  


అక్రమ అరెస్ట్‌లతో పోరాటాన్ని ఆపలేరు..

హైదరాబాద్/ఎల్‌బీనగర్‌: అక్రమ అరెస్ట్‌లతో ప్రజాపోరాటాలను ఆపలేరని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధినాలకు నిరసనగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో జాతీయ రహదారి దిగ్భంధనం చేశారు. ఈ  సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ అక్రమ అరె్‌స్టలతో ప్రజాపోరాటాలను ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ బండి మధుసూదన్‌రావు, యువజన కాంగ్రెస్‌ నాయకులు చిలుక ఉపేందర్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు పున్న గణే్‌షనేత, నల్లెంకి ధన్‌రాజ్‌గౌడ్‌, తలాటి రమే్‌షనేత, గట్ల రవీంద్ర, ఎన్‌ఎ్‌సయూఐ శివ, యాదయ్య, పాల్గొన్నారు.


కేంద్ర, రాష్ట్రాలవి ప్రజా వ్యతిరేక విధానాలు..

చంపాపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఐఎ్‌సటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్‌ అన్నారు. చంపాపేట, హస్తినాపురం డివిజన్‌లలో సోమవారం అఖిల పక్ష పార్టీలు నిర్వహించిన భారత్‌ బంద్‌ కార్యక్రమం విజయవంతమైంది. చంపాపేట గాంధీబొమ్మ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, నాయకులు మతీన్‌ షరీఫ్‌, నారాయణ, యాదగిరి, కిరణ్‌, సారయ్య, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


హయత్‌నగర్‌లో..

హయత్‌నగర్‌: సోమవారం హయత్‌నగర్‌లో బంద్‌ పాక్షికంగా జరిగింది. సీపీఐ, కాంగ్రెస్‌, సీపీఎం, టీజేఎస్‌, టీడీపీ నాయకులు హయత్‌నగర్‌లో వ్యాపార సముదాయాలను, విద్యా సంస్థలను మూయించారు. ఉదయం హయత్‌నగర్‌ డిపో ఎదుట కాంగ్రెస్‌ నాయకుడు చిలుక మధుసూదన్‌రెడ్డి, గుర్రం శ్యామ్‌చరణ్‌రెడ్డి బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ర్యాలీగా వస్తున్న సీపీఐ రాష్ట్ర నాయకులు అందోజు రవీంద్రాచారి, ముత్యాల యాదిరెడ్డి, సామిడి శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌లు లక్ష్మణ్‌, మాజీ కౌన్సిలర్‌ హరిసింగ్‌నాయక్‌, చందునాయక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీపీఐ మహిళా నాయకురాలు లావణ్య చేయి విరిగింది. టీడీపీకి చెందిన సింగిరెడ్డి మురళీధర్‌రెడ్డి, మరాటి భిక్షపతితోపాటు పలువురు వ్యాపార, విద్యా సంస్థలను మూయించారు. గుర్రం శ్రీనివా్‌సరెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు. 


తుర్కయంజాల్‌లో... 

తుర్కయంజాల్‌లో అఖిల పక్షాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. వ్యాపారాలను బంద్‌ చేయించి రోడ్డుపై బైఠాయించారు. మున్సిపాలిటీ కాంగ్రెస్‌ అఽధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్‌, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొశిక ఐలయ్యతోపాటు కుంట గోపాల్‌రెడ్డి, సామ భీంరెడ్డి తదితరులు, సీపీఎంకు చెందిన కిషన్‌, శంకర్‌నాయక్‌, భాస్కర్‌, సీపీఐకి చెందిన ఓరుగంటి యాదయ్య, శివకుమార్‌, తెలంగాణ జాగీరు పార్టీ నాయకుడు జయరాజ్‌, టీడీపీ నాయకులు రావుల వీరేశం, వెంకటేష్‌, బీఎ్‌సపీకి చెందిన మేడిపల్లి మహేష్‌, బాబులను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి మీర్‌పేట్‌, ఆదిభట్ల, అబ్దుల్లాపూర్‌మెట్‌, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం పోలీ్‌సస్టేషన్‌లకు తరలించారు. 


వనస్థలిపురం : వనస్థలిపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మకుటం సదాఽశివుడు, చందు నాయక్‌, శేఖర్‌రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులను వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. 


మన్సూరాబాద్‌ : డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో మన్సూరాబాద్‌లో దుకాణాలు మూయించారు. వారికి పోలీసులు అడ్డుచెప్పారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బండ శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి చిన్న సతీ్‌షరెడ్డి, స్వామిముదిరాజ్‌, చెరుకు పెంటన్న పాల్గొన్నారు. 


మలక్‌పేటలో..

చాదర్‌ఘాట్‌ : సోమవారం మలక్‌పేటలో మాజీ కార్పొరేటర్‌ చెకొలేకర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగా మలక్‌పేట పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం శ్రీనివా్‌సతోపాటు మరో 10మందిని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ చౌరస్తాలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు బాబు శ్రీనివాస్‌, షేక్‌ అర్షద్‌, ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌ అధ్యక్షుడు కొమిరెల్లి రాజశేఖర్‌రెడ్డి, నాయకులతో కూడిన బృందం ర్యాలీ నిర్వహిస్తుండగా చాదర్‌ఘాట్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 


దిల్‌సుఖ్‌నగర్‌ డిపో ఎదుట ధర్నా...

దిల్‌సుఖ్‌నగర్‌ డిపో ఎదుట సోమవారం తెల్లవారుఝామున లింగోజి గూడ డివిజన్‌ కార్పొరేటర్‌ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ జన సమితి ఎల్‌బీనగర్‌ ఇన్‌చార్జి కేవీ రంగారెడ్డితోపాటు పలువురు నాయకులు ధర్నా నిర్వహించారు. డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను మలక్‌పేట పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేసి మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. 

బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌లలో

సరూర్‌నగర్‌ : బాలాపూర్‌ మండలంలోని బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ కార్పొరేషన్ల పరిధిలో భారత్‌ బంద్‌ ప్రశాంతంగా, సంపూర్ణంగా కొనసాగింది. దాదాపు అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసి వేశారు. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు యెల్లేటి అమరేందర్‌రెడ్డి, వంగేటి ప్రభాకర్‌రెడ్డి, బడంగ్‌పేట్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు పెద్దబావి వెంకట్‌రెడ్డి, మీర్‌పేట్‌ శాఖ అధ్యక్షుడు సామిడి గోపాల్‌రెడ్డి, బీఎస్పీ మహేశ్వరం ఇన్‌చార్జి గుడ్ల శ్రీనివాస్‌, వైఎ్‌సఆర్‌టీపీ నాయకురాలు విజయాప్రసాద్‌, సీపీఎం నాయకులు టి.కిషోర్‌, యాదగిరిచారి తదితరులు పాల్గొని బంద్‌ నిర్వహించారు. ఆయా కార్పొరేషన్లలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. 


సైదాబాద్‌: సైదాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలను ముందస్తు అరెస్ట్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వారిలో టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్‌,  డివిజన్‌ అధ్యక్షుడు దేవదాసు, నాయకులు రఘుపతి నాయుడు, కిషన్‌ నాయక్‌, కృష్ణవేణి, వెంకటమ్మ, అలివేలు తదితరులు  ఉన్నారు. 


శివారులో ప్రశాంతం..

అబ్దుల్లాపూర్‌మెట్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం శివారులో కొన్ని షాపులు బంద్‌ పాటించగా మరికొన్ని యథావిధిగా తెరిచారు. జాతీయ రహదారిపై నిరసన తెలిపేందుకు వస్తున్న కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ నేతలను పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో బింగి దాసుగౌడ్‌, బుర్ర మహేందర్‌గౌడ్‌, కొత్త ప్రభాకర్‌గౌడ్‌, వెంకటే్‌షకేశెట్టి, గౌస్‌పాషా తదితరులు ఉన్నారు. 


పెద్దఅంబర్‌పేట్‌లో....

పెద్దఅంబర్‌పేట్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చెక్‌పోస్టు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జైపాల్‌రెడ్డి,, చామ విజయశేఖర్‌రెడ్డి, రాజేందర్‌ ముదిరాజ్‌, సురేష్‌, శంకరయ్య, జంగయ్యపాడి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.