Abn logo
Sep 28 2021 @ 00:35AM

బంద్‌ పాక్షికం

జిల్లాలో యథావిధిగా తిరిగిన ఆర్టీసీ బస్సులు

కొనసాగిన వ్యాపార లావాదేవీలు

తెరుచుకోని పాఠశాలలు

రహదారులపై బైఠాయించిన నాయకులు

నేతలను అరెస్టు చేసిన పోలీసులు

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 27: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, కాంగ్రెస్‌, టీజేఎస్‌, టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారత్‌ బంద్‌ జిల్లాలో పాక్షికంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యాసంస్థలు మూసిఉంచగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కొనసాగాయి. దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మధ్యాహ్నం తెరుచుకున్నాయి. అలాగే ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష రాజకీయ రైతు, కార్మిక సంఘాలు సోమవారం జిల్లా వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించి, రాస్తారోకోలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ బిల్లును రద్దు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సాజిద్‌ఖాన్‌, గండ్రత్‌ సుజాత, టీడీపీ నాయకులు రాజారెడ్డి, ఎండీ రపిక్‌, రాము, పతిహార ప్రభాకర్‌, సీపీఐ, సీపీఎం నాయకులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, రాములు, విలాస్‌, బండిదత్తాత్రి, డి.మల్లేష్‌, రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌక్‌ల గుండా బైక్‌ ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూసి వేయించి భారత్‌బంద్‌కు సహకరించాలని కోరారు. అటు ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు సైతం బంద్‌కు మద్దతుగా బైక్‌ ర్యాలీ నిర్వహించి రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సోమవారం గుడిహత్నూర్‌లో భారత్‌బంద్‌ చేపట్టారు. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని షాపులను హోటళ్లను మూసి ఉంచారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌, మాజీ జడ్పీటీసీ మాస్క్‌మాదవ్‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ బేరదేవన్న, నాయకులు జాదవ్‌భీంరావ్‌, చట్ల మహేందర్‌, తబ్రేజ్‌ఖాన్‌మాదవ్‌, దేవ్‌రావ్‌, సంతోష్‌, కళ్లెపెల్లి ప్రేమ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌: మండలంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడగా బ్యాంకులు పని చేయలేదు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఉన్న ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ ప్రధాన రహాదారిపై నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఇందులో రాథోడ్‌ చారులత, వెడ్మబోజ్జు, లంకరాఘవులు, కొమ్ము విజయ్‌, పవార్‌ దేవిదాస్‌, లింగంపల్లి చంద్రయ్య, పుర్కబాపురావు పాల్గొన్నారు.

నేరడిగొండ: మండల కేంద్రంలోని వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆడే వసత్‌రావు, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, జాదవ్‌ వసంత్‌రావ్‌, సద్దాం, నక్క లక్ష్మణ్‌, రాజేందర్‌, నరేష్‌స్‌రెడ్డి, మొహన్‌రెడ్డి, నారాయణ, శంకర్‌, చంద్రశేఖర్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రే ణులు సోమవారం భారత్‌ బంద్‌ చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్ష్మణ్‌, కొడప రాజు, మల్లేష్‌, గంగాధర్‌, సతీష్‌, రమేష్‌, రాజు, రాజేందర్‌, కృష్ణ, శ్రీనివాస్‌, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.

తలమడుగు: మండలంలోని సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ కళ్యాణం రాజేశ్వర్‌, జడ్పీటీసీ గణేష్‌రెడ్డి, తుడుందెబ్బ మండల కన్వీనర్‌ మేస్రం మనోహార్‌, సీపీఐ నాయకులు శ్రీనివాస్‌, అఖిల పక్షం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి: భారత్‌ బంద్‌లో భాగంగా సోమవారం వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు సంగెపు బొర్రన్న, మెస్రం మనోహర్‌, మీర్జాఆరీఫ్‌బేగ్‌, రాథోడ్‌ గణేష్‌, మెస్రం నాగనాథ్‌, సోమాసే వెంకట్‌రావు, మీర్జా యాకుబ్‌బేగ్‌, ఆరీఫ్‌, పారిక్‌, సోయం రాందాస్‌, కాంబ్లే బాలాజీ, వాగ్మారే సుద్దోదన్‌ పాల్గొన్నారు. 

తాంసి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ వామపక్షాలతో కలిసి ధర్నా చేపట్టింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ సంధ్యారాణికి అందజేశారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ బోథ్‌ ఇన్‌చార్జి వన్నెల అశోక్‌, కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ కె.సంతోష్‌, సీపీఐ జిల్లా నాయకులు జింకజైహింద్‌, రతన్‌, అశోక్‌ పాల్గొన్నారు. 

బోథ్‌: కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల నాయకులు బోథ్‌ బస్టాండ్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు గంగాధర్‌, మల్లెపూల సత్యనారాయణ, కుర్మె మహేందర్‌, మహ్మద్‌,రాజశేఖర్‌, నర్సారెడ్డి, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.