విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నేడు బంద్‌

ABN , First Publish Date - 2021-03-05T06:50:07+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా జిల్లా ఆర్టీసీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అన్ని సర్వీసులు నిలిపివేస్తోంది. జిల్లాలోని 9 డిపోల్లోనూ మధ్యాహ్నం వరకూ బస్సులు తిప్పకూడదని ఈ మేరకు అధికారులు నిర్ణయించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నేడు బంద్‌

  • జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ సర్వీసులు బంద్‌
  • విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేత

రాజమహేంద్రవరం అర్బన్‌/కాకినాడ (కార్పొరేషన్‌) మార్చి 4 : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా జిల్లా ఆర్టీసీ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అన్ని సర్వీసులు నిలిపివేస్తోంది. జిల్లాలోని 9 డిపోల్లోనూ మధ్యాహ్నం వరకూ బస్సులు తిప్పకూడదని ఈ మేరకు అధికారులు నిర్ణయించారు. దీనిపై ఆయా డిపో మేనేజర్లకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. రాష్ట్ర బంద్‌ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులన్నీ నిలిపివేస్తున్నామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఆర్‌వీఎస్‌ నాగేశ్వరరావు తెలిపారు. తెల్లవారుజామున, ఉదయంపూట వెళ్లే సర్వీసులు కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి అన్ని సర్వీసులు యథావిధిగా తిరుగుతాయని ఆయ న స్పష్టం చేశారు. రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు, ప్రజా సంఘాలు నాయకత్వం వహిస్తుండగా, ఈ బంద్‌కు మద్దతుగా వర్తక, వాణిజ్య సంస్థలు మూసివేయడానికి నిర్ణయించాయి. ఇప్పటికే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంస్థలు ప్రకటనలు జారీచేసి వ్యాపార సంస్థలను మూసివేస్తామని ప్రకటించాయి. విద్యా సంస్థలు సైతం బంద్‌కు సంఘీభావంగా సెలవు ప్రకటించాయి. 

Updated Date - 2021-03-05T06:50:07+05:30 IST