బండి సంజయ్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-11-16T22:45:05+05:30 IST

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతంతో పాటు ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించారని సంజయ్‌పై అభియోగం మోపారు.

బండి సంజయ్‌పై కేసు నమోదు

నల్గొండ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతంతో పాటు ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించారని సంజయ్‌పై అభియోగం మోపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదయింది. నల్గొండ రూరల్, మాడగులపల్లి, వేములపల్లి పీఎస్‌లలో బండి సంజయ్ పై కేసులు నమోదు చేశారు. 


కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్తలు చోటు చేసుకున్న విషయం తెలిసింది. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. పలుచోట్ల ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, కోడి గుడ్ల దాడులు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేశారని బండిసంజయ్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే పోలీసుల తీరుపై బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. తమ నేతలు, కార్యకర్తలపై మాత్రమే కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


Updated Date - 2021-11-16T22:45:05+05:30 IST