బండి సంజయ్ జనగామ జిల్లా పర్యటన రద్దు

ABN , First Publish Date - 2021-11-17T01:00:53+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ జిల్లా పర్యటన

బండి సంజయ్ జనగామ జిల్లా పర్యటన రద్దు

జనగామ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ జిల్లా పర్యటన రద్దయింది. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. తిరుమలగిరి నుంచి జనగామ వరకు అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణులు మోహరించాయి. దీంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోనే బీజేపీ పదాధికారుల సమావేశం జరుగనుంది. దీంతో తిరుమలగిరిలో సంజయ్ పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్ర పధాదికారుల సమావేశానికి  సంజయ్ హాజరుకావాల్సి ఉంది. తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో మరికాసేపట్లో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 


Updated Date - 2021-11-17T01:00:53+05:30 IST