బండి సంజయ్‌ ఉన్మాది: శ్రీనివా్‌స గౌడ్‌

ABN , First Publish Date - 2021-03-08T08:43:34+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉన్మాదిలా మారారని, పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని, సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

బండి సంజయ్‌ ఉన్మాది: శ్రీనివా్‌స గౌడ్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉన్మాదిలా మారారని, పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని, సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహిళల గురించి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడటం మంచిదికాదని, ప్రజలు చూస్తూ ఊర్కోరని, నాలుక చీరేస్తారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామంటున్నారని, దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నందుకు జైల్లో పెడ తారా అని ప్రశ్నించారు.

Updated Date - 2021-03-08T08:43:34+05:30 IST