మా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల అంశం: బండి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-01-28T19:14:05+05:30 IST

ఉద్యోగులకు ఈ నెలకు పాత జీతాలే ఇవ్వాలని, రాత్రి పూట ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలని...

మా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల అంశం: బండి శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా: ఉద్యోగులకు ఈ నెలకు పాత జీతాలే ఇవ్వాలని, రాత్రి పూట ఇచ్చిన  చీకటి జీవోలు రద్దు చేయాలని ఏపీ ఎన్టీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తమ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే తెరపైకి కొత్త జిల్లాల అంశం ప్రభుత్వం తీసుకువచ్చిందని, కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడో చేపట్టాల్సిన ప్రక్రియ అని అన్నారు. ప్రభుత్వం ఏం చేసినా తమ ఉద్యమం పక్కదారి పట్టదని ఆయన స్పష్టం చేశారు. 


మంత్రి మండలి ఉపసంఘం సమస్యని జటిలం చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులను రెచ్చగొట్టే దోరణిలో ఏ చిన్న సంఘం వచ్చినా చర్చలు  జరుపుతామని చెప్పడం సరికాదన్నారు. కొంత మంది కావాలనే పెయిడ్ ఆర్టిస్ట్‌లను తయారు చేసి చర్చలు జరపడం కరెక్ట్ కాదన్నారు. కొంత మంది కలెక్టర్లు, ఐఎఎస్ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, రేపటి నుంచి వాళ్ల దగ్గర పని చేసే వాళ్లు కూడా ఉండరని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-28T19:14:05+05:30 IST